Site icon NTV Telugu

హన్సిక ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్’!

Hansika Motwani's 105 Minutes : An Innovative experiment on Indian Screen

”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ చిత్రంలో నటిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం & రియల్ టైం’ అనేవి ఈ చిత్రానికి హైలైట్స్.

Read Also : సూర్య స్థానంలో హృతిక్! సాధ్యమేనా?

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ ఈ మూవీని పర్యవేక్షిస్తున్నారు. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘105 మినిట్స్’ చిత్రానికి సామ్ సి. యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి యాక్షన్ డైరెక్టర్ మల్లి.

Exit mobile version