NTV Telugu Site icon

Kingston: తెలుగులోకి మార్చి 7న మరో డబ్బింగ్ సినిమా ‘కింగ్స్టన్’

Kingston

Kingston

ఇప్పటికే మార్చ్ 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో గానూ, మ్యూజిక్ కంపోజర్ గానూ రాణిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్స్టన్’ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు రూపొందించాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది.‌ తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

Suzhal 2: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘సుడల్ సీజన్ 2’ వచ్చేసింది!

ఆ ట్రైలర్ పరిశీలిస్తే అనగనగా ఓ ఊరు… అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ‘ఒకరి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది. మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకు’ అని ఎందుకు ఒకరు చెప్పారు… సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత ‘ఒడ్డున ఎవరి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావాలి’ అని హీరో ఎందుకు చెప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సముద్రంలోకి హీరో వెళ్ళినప్పుడు అతని దగ్గరకు వచ్చిన దెయ్యాల కథ ఏమిటి? అనేది ఆసక్తికరం. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని ఈ ట్రైలర్ కచ్చితంగా కలిగిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర ప్రధాన తారాగణం.