Site icon NTV Telugu

GV Prakash Mother: జి.వి.ప్రకాష్ విడాకులపై.. ఏఆర్ రెహమాన్ సోదరి కీలక వ్యాఖ్యలు

Gv Prakash

Gv Prakash

GV Prakash Mother Comments: కోలీవుడ్‌లో విడాకుల సీజన్‌ నడుస్తోంది తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో విడిపోయారు. ఇటీవలే నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జివి ప్రకాష్ కుమార్-గాయని చైందవి దంపతులు ఈ ఏడాది కూడా విడాకులు తీసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. జివి ప్రకాష్ కుమార్- గాయని సైంధవి 2013లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.

Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్

ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి వరకు సినిమాల్లో మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే పనిచేసిన జివి ప్రకాష్ ఆ తర్వాత హీరో అవతారం ఎత్తారు. ఒకానొక సమయంలో జివి ప్రకాష్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా రావడంతో తన సంగీతాన్ని పక్కన పెట్టి నటనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిర్మాతగానూ వ్యవహరిస్తున్న జివి ప్రకాష్ కుమార్ కింగ్ స్టన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కింగ్‌స్టన్‌లో జివి ప్రకాష్ కుమార్ సరసన దివ్య భారతి నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా, జివి ప్రకాష్ తల్లి రెహానా తన కొడుకు విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది. ఆమె మతిక్కలం మలై అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించారు. ఇటీవల దాని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రెహానా జివి ప్రకాష్ విడాకుల గురించి లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ.. కొంతమంది పరిస్థితి అలా ఉంది, దానికి మనం ఏం చేయగలం అని పేర్కొన్నారు.

Exit mobile version