Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా వేశారు.
అయితే ఈ సినిమా సినిమా రీ-రికార్డింగ్ వర్క్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేపడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ నిర్మాతలు అధికారికంగా స్పందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని చెబుతూ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ‘జెట్ స్పీడ్’లో ఆర్ఆర్ (RR) వర్క్‌ను పూర్తి చేస్తున్నారని ఆ పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కి తమన్ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని తేలిపోవడంతో రూమర్లకు తెరపడినట్లయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో, తమన్ అందించే రీ-రికార్డింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?