Gurram Paapi Reddy: ఆసక్తికరంగా గుర్రం పాపిరెడ్డి టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.
Also Read:Tollywood: తెలుగు సినిమాల్లో పనిచేయాలని ఉందా.. మీకు ఇదే గోల్డెన్ చాన్స్!
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఈ సందర్భంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
Also Read: Anandhi : తెలుగులో బిజీ అవుతున్న వరంగల్ పోరి
సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. “గుర్రం పాపిరెడ్డి” సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా అన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!