Site icon NTV Telugu

Guess the Celebrity: పవన్-రేణు దేశాయ్ పక్కన కూర్చున్న ఈ పాపను గుర్తు పట్టారా?

Niharika With Pawa

Niharika With Pawa

Guess the Celebrity with Pawan Kalyan and Renu Desai: ఒక్కోసారి పాత ఫోటోలు చూస్తే భలే ఆసక్తికరం అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ సహా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి హాజరైన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పాప ఇంకా ఎవరో కాదు మెగా డాటర్ నిహారిక. నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. వాళ్ళందరూ తమ శైలిలో నటిస్తూ తమ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కుటుంబం నుంచి ఏకైక హీరోయిన్ గా వచ్చింది నిహారిక.

Prabhas: రాజువయ్యా.. మహారాజువయ్యా.. ప్రతి ఏటా 100 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు!!

పెళ్లికి ముందు కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లయిందని మానేసింది. ఈ మధ్యనే భర్త నుంచి విడిపోయిన ఆమె మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ నిర్మాణం చేస్తూ బిజీ అవుతుంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాల లో నటించిన ఆమె ఇప్పుడు సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని నిహారిక నిర్మించగా యదు వంశీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పిఠాపురం కూడా వెళ్లి తాను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ ప్రమోషన్స్ లో ఆమె వాడుతున్న డైలాగులు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version