Site icon NTV Telugu

Govinda Divorce : గోవిందా విడాకుల రూమర్స్‌పై క్లారిటీ..

Govindha Divors

Govindha Divors

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 38 ఏళ్ల వైవాహిక బంధం ఫుల్ స్టాప్ దిశగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే, ఈ వార్తలపై ఆయన భార్య సునీత అహుజా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “గోవిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటికి చాలా మంది అతిథులు వస్తుండేవారు. దీనివల్ల మా కుమార్తె ఇబ్బంది పడేది. అందుకే వేరే ఇంట్లో ఉంటున్నాం. కానీ విడాకులు అనేది అసత్యం” అని క్లారిటీ ఇచ్చారు. అయిన కూడా ఈ ఆగడాలు ఆగడం లేదు.. దీంతో తాజాగా గోవిందా తరఫు లాయర్ లలిత్ బింద్రా కూడా వివరణ ఇచ్చారు.

Also Read : Kantara Prequel : తెలుగు స్టేట్స్‌లో ‘కాంతార ప్రీక్వెల్’కు కోట్ల డీల్ టాక్ – అంత రిస్క్ అవసరమా?

“విడాకులకు సంబంధించిన ఎలాంటి కేసు లేదు. కావాలనే కొందరు పాత విషయాలను మళ్లీ బయటకు తీస్తున్నారు” అని లాయర్ స్పష్టం చేశారు. అలాగే వినాయకచవితి సందర్భంలో గోవిందా, సునీత జంటగా కనిపిస్తారని అన్నారు. అయినా మరోసారి ఈ రూమర్స్ రావడం గమనార్హం. తాజాగా, సునీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారంటూ బాలీవుడ్ మీడియాలో రిపోర్ట్స్ రావడంతో చర్చ మళ్లీ మొదలైంది. అయితే లాయర్ స్పష్టత ఇచ్చేసరికి అభిమానులకు క్లారిటీ వచ్చింది.

Exit mobile version