Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!

Gopichand Villain

Gopichand Villain

Gopichand: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మళ్లీ విలన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే ఒక తమిళ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారా? గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. కెరీర్ మొదట్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ లాంటి సినిమాలతో విలన్‌గా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకున్న గోపీచంద్, మళ్లీ నెగటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారనే వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్‌లోనూ కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే, ఈ ప్రచారానికి గోపీచంద్ టీమ్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టి అసలు నిజాన్ని బయటపెట్టింది.

తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై గోపీచంద్ టీమ్ అఫీషియల్‌గా స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను, సోషల్ మీడియా పేజీలను కోరింది. హీరో గోపీచంద్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు ఉన్నా, లేదా అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ చేయాలన్నా నేరుగా తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే చెప్తామని టీమ్ క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి రూమర్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. మొత్తానికి, విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ అంటూ సాగిన ప్రచారానికి ఈ ఒక్క ప్రకటనతో తెరపడినట్లు అయ్యింది.