Gopichand as Villian for Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్‌గా.. మ్యాచో స్టార్ గోపిచంద్‌ను సెట్ చేస్తున్నారా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్‌కు.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో.. ‘జయం’ సినిమాలో విలన్‌గా దుమ్ముదులిపేశాడు గోపీ. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్‌గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్‌ది హీరో కటౌట్ కాబట్టి.. ‘యజ్ఙం’ సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ స్టార్ హీరో. ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా గోపీచంద్‌కు సరైన విజయాలు వరిచండం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ అనే సినిమా చేస్తున్నాడు.
Lavanya: నేను రాజ్ తరుణ్ కలిసి డ్రగ్స్ తీసుకున్నాం.. బాంబు పేల్చిన లావణ్య
అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమతో మ్యాచోమ్యాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. గోపీచంద్ మరోసారి విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా బాలయ్యకు విలన్ అని అంటున్నారు. ప్రజెంట్ బాబీ డైరెక్షన్లో ఎన్బీకె 109 ప్రాజెక్ట్ చేస్తున్న బాలయ్య.. నెక్స్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది అఖండ2 అనే ప్రచారం కూడా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్‌ను విలన్‌గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు.. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. గోపీచంద్ మళ్లీ విలన్‌గా చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గోపీచంద్ సై అంటే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే.. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.