Site icon NTV Telugu

Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..

Good Wife

Good Wife

ఒక్కప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ప్రియమణి.. ప్రజెంట్ రీ ఎంట్రీ ఇచ్చి సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ అని తేడాలు చూడడం లేదు. తనకు నచ్చిన కథలు ఎక్కడ లభిస్తే అక్కడ యాక్ట్ చేస్తుపోతుంది.  రీసెంట్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టగా.. తాజాగా  ‘గుడ్ వైఫ్’ అనే వెబ్ సిరిస్ తో రాబోతుంది ప్రియమణి. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందినట్లు సమాచారం.

Also Read : Jack : జాక్ దెబ్బ.. 4 కోట్లు వెనక్కిచ్చేసిన సిద్దు

సెక్స్ కుంభ‌కోణంలో చిక్కుకున్న త‌న భ‌ర్త‌ను ర‌క్షించేందుకు ఓ మాజీ లాయ‌ర్ చేసిన పోరాటం నేప‌థ్యంలో అదిరిపోయే థ్రిల్లింగ్‌, ఎమోష‌న‌ల్ డ్రామాగా ఉండ‌నుంది.  త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. కాగా ఈ మూవీలో ప్రియమణి లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఇలా విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ అంతకు మించి అని చెప్పాలి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ‌లో కూడా సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్ స్టార్ ఓటీటీ పేర్కొంది.

 

Exit mobile version