NTV Telugu Site icon

GOAT : విజయ్ GOAT 4 డేస్ కలెక్షన్స్.. అక్కడ నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..

Untitled Design (1)

Untitled Design (1)

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 3 గంటలకు పైగా నిడివి, అక్కడక్కడా లాగ్, రొటీన్ కథ కావడంతో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది గోట్. విజయ్ యంగ్ గెటప్ లుక్ పట్ల ఫ్యాన్స్ కూడా నిరుత్సహానికి గురయ్యారు. ఎన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన గోట్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది.

Also Read : Thangalaan : తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చూడాలంటే షరతులు వర్తిస్తాయ్..

మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 126.32 కోట్లతో అదిరిపోయే స్టార్ట్ అందుకుంది. ఇక మొదటి వీకెండ్ ముగిసేనాటికి 4రోజులకు గాను రూ. 288 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు కేరళలో ఈ చిత్రం భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. మొదట రోజు రూ. 5. 80 కోట్లు మాత్రమే రాబట్టింది. 4 రోజులకు గాను రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గోకులం మూవీస్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రూ.22 కోట్లకు  goat థియేట్రికల్ రైట్స్ ను కొంగలు చేయగా మొదటి 4రోజులకు గాను 10.10 కోట్లు రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే బిగ్ జంప్ రావాలి. అది సాధ్యం అయ్యే పనే కాదు.  కన్నడలో మాత్రం రూ.21.10 కోట్లు రాబట్టి స్టడీగా సాగుతుంది. అటు ఓవర్సీస్ లో మాత్రం దుమ్ముదులుపుతుంది ఇప్పటివరకు $14.26M ( 120కోట్లు) కొల్లగొట్టింది.

Show comments