Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో ‘పెద్ది’ ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
“బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా” అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. “ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది” అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు ‘పెద్ది’ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!