దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా హీరోనే అయినా సరే, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్కీ భాస్కర్, సీతారామం లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్‌లుగా నిలిచాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 41వ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. దసరా సినిమాతో నిర్మాతగా గుర్తింపు దక్కించుకున్న సుధాకర్ చెరుకూరి, తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద పదో సినిమాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు.
Also Read :Sridevi: శ్రీదేవి – రజనీకాంత్ ప్రేమకు అడ్డు పడిందెవరో తెలుసా?
కొత్త దర్శకుడు రవి నేలకుదిటి దర్శకత్వంలో, నేటి యువత కనెక్ట్ అయ్యేలా ఒక కాంటెంపరరీ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోంది. ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేయడమే కాదు, పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. దసరా హీరో నాని ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యాడు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గుణ్ణం సందీప్, నాని, గుణ్ణం రమ్య స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు. ఫస్ట్ షాట్‌ను దర్శకుడే డైరెక్ట్ చేసుకోవడం గమనార్హం. దసరా, ది పారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
