Ghaati Pre Review: అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ.. రేపు ఊచకోతే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క లీడ్ రోల్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఘాటి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో.. మొదటి నుంచి ‘ఘాటి’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్.. అనుష్క చేయబోయే విధ్వంసానికి శాంపిల్‌గా ఉండగా.. లేటెస్ట్‌గా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అయిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్‌ను సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు డార్లింగ్. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. అనుష్క చేయబోయే ఊచకోతకు గూస్‌బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది. స్వీటీ చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది.
Also Read : Anushka : తెలుగులో కొత్త సినిమా..ఇది పవర్ ఆఫ్ సినిమా!
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్‌బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సాగిన రిలీజ్ ట్రైలర్‌లో అనుష్క పర్ఫామెన్స్ మామూలుగా లేదు. శీలావతిగా ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈసారి దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో అనుష్కతో ఊచకోత చేయించినట్టుగా ఉంది. అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందే రానని చెప్పినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రానాతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన స్వీటికి ఇప్పుడు ప్రభాస్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మంచి బజ్ జనరేట్ అయ్యేలా చేసింది. దీంతో.. ఘాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి రానుండగా.. ఇంకొన్ని గంటల్లో తెరపై శీలావతి ఊచకోతను చూడబోతున్నాం. ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతికి మించి ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం అనే సినిమాలో నటించారు అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్ర లాగే, ఇప్పుడు ‘ఘాటి’లో షీలావతి పాత్ర ప్రత్యేకంగా ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందనే అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!