Site icon NTV Telugu

Ghaati :అనుష్క కోసం రంగంలోకి అల్లు అర్జున్.. ఫోన్ కాల్ లీక్

Ghaati

Ghaati

అనుష్క హీరోయిన్‌గా నటించిన ఘాటి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పటికే అనుష్క ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు కెమెరా ముందుకు రాకపోయినా, రానా ఫోన్ కాల్‌తో పాటు ఫోన్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అనుష్క నిన్న ట్విట్టర్ స్పేస్‌లో కూడా సందడి చేసింది. తాజాగా, అల్లు అర్జున్‌తో అనుష్క ఫోన్ మాట్లాడుతున్న ఆడియోని నిర్మాణ సంస్థ యూ వీ క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫోన్ కాల్‌లో, అల్లు అర్జున్ పార్టీ సినిమాకి సంబంధించి పలు ప్రశ్నలు అడగ్గా, అనుష్క ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. “ఇప్పుడు నిన్ను ఘాటి అని పిలవాలా, స్వీటీ అని పిలవాలా?” అంటే, “మేము ఇప్పటికీ స్వీటీనే” అంటూ అనుష్క సమాధానం చెప్పింది. వీళ్ళిద్దరూ కలిసి వేదం సినిమాతో పాటు రుద్రమదేవి సినిమాలో నటించారు. అలాగే, కృష్ణ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో అల్లు అర్జున్ నటించిన వీరు, ఫోన్ కాల్ ప్రమోషన్‌తో ముందుకు వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వినండి.

Exit mobile version