NTV Telugu Site icon

Supritha: సినిమా టైటిల్ పెడతారా.. ట్రై చేయండి!

Supritha Movie

Supritha Movie

ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే “సినిమా మాది – టైటిల్ మీది” అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా, మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్ గా రూపొందిస్తున్నారు.

Tollywood Rewind 2024 : టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు ఎవరెవరంటే?

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రేక్షకుల చేతే సినిమా టైటిల్ ఫిక్స్ చేయాలని నిర్ణయించారు మేకర్స్. అందుకే సినిమా టీం “సినిమా మాది – టైటిల్ మీది” అని ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తూ, తమ సినిమా సూట్ అయ్యే టైటిల్ ను ఆడియన్స్ నిర్ణయించాలని కోరారు. ప్రేక్షకులు అనుకున్న టైటిల్ ని +91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించాలని ప్రేక్షకులను ఆహ్వానించారు. సెలెక్ట్ ఐన టైటిల్ ని సినిమా టీం స్వయంగా ప్రేక్షకుల ఇంటి వద్దకి వచ్చి వారితోనే టైటిల్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Show comments