Site icon NTV Telugu

Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్..

Genelia Marriage Rumors,

Genelia Marriage Rumors,

అందం, చలాకీ నటనతో యువ హృదయాలను దోచిన నటి జెనీలియా. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రజంట్ ఆమె ఇప్పుడు సెకండ్ ఈన్నింగ్ ప్రారంభించి సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు చేస్తోంది. ఈ నెల 20న విడుదల కానున్న ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రంలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుండగా ఆమె కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే..

Also Read : Mukul Dev : ముకుల్ దేవ్ మృతి పై.. సోదరుడు రాహుల్ దేవ్ ఎమోషనల్ రియాక్షన్

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జెనీలియా తన గతానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. దాదాపు 14 ఏళ్ల క్రితం తనకు, నటుడు జాన్ అబ్రహామ్‌కి పెళ్లయిందనే పుకార్లు తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.. ‘ఆ వార్తలను కొందరు కావాలనే సృష్టించారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు కూడా. సెట్ ల్లోనే మా పెళ్లి జరిగిందని చాలా పెద్ద ప్రచారమె చేశారు. అలా ఎందుకు చేశారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే వీటి తర్వాత ఏడాదిలోనే బాలీవుడ్ హీరో, తన స్నేహితుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న జెనీలియా ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్న ఆమె, నటిగా మళ్లీ తనదైన శైలిలో వెలుగొందుతోంది.

Exit mobile version