NTV Telugu Site icon

Geethanjali malli vachindi : ఓటీటీలోకి వచ్చేసిన గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 05 09 At 8.21.56 Am

Whatsapp Image 2024 05 09 At 8.21.56 Am

క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మేరకు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్ అంజలి మంచి హిట్ అందుకుంటుందని అంతా భావించారు.కానీ ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఇదిలా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నెల లోపే ఓటిటిలోకి వచ్చింది.’గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని మే 8 స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. కానీ సాయంత్రం అయ్యేవరకు కూడా ఈ సినిమా ఓటిటికి రాకపోవడంతో ఈ సినిమా వస్తుందా రాదా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలైంది .అయితే ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది.