Gedela Raju: ఓటీటీలో రచ్చ చేస్తున్న ‘గేదెలరాజు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచే, ఇటీవల నటుడిగానూ తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, స్వయంగా స్వరాలు సమకూర్చిన లేటెస్ట్ చిత్రం ‘గేదెలరాజు’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ ఊహించని రెస్పాన్స్ సాధిస్తూ టాప్ ట్రెండింగ్ చిత్రాల జాబితాలో నిలిచింది. ముఖ్యంగా ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఈ సినిమా సత్తాకు నిదర్శనం.
మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన రాసుకున్న నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుండటంతో, క్రిటిక్స్ మరియు మూవీ లవర్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్ రోల్ ‘గేదెలరాజు’గా రఘు కుంచే తన నటనతో అదరగొట్టగా, ఆయన అందించిన పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కథకు ప్రాణంగా నిలిచే ఈ సంగీతం థ్రిల్లింగ్ అనుభూతిని రెట్టింపు చేస్తోంది. ఈ చిత్రంలో వికాస్, టీనా శ్రావ్య, రామచంద్రం, మోనికా కలపాల, రవి చిన్నిబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, బాషా, దివ్య మోటూరి తదితరులు కీలక పాత్రలలో నటనతో ఆకట్టుకున్నారు. థియేటర్ మిస్సయిన వారు ఈ సరికొత్త సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ డ్రామాను ఆహా, ప్రైమ్ వీడియోలలో చూడొచ్చు.
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!