Site icon NTV Telugu

శింబు, గౌతమ్ మెనన్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ!

Gautham Menon, Simbu and AR Rahman team up once again!

గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు మడమైదా’ సినిమాలు చేశాడు. ఆ రెండు ప్రేక్షకుల నుంచీ, విమర్శకుల నుంచీ మంచి రివ్యూస్ అందుకున్నాయి. అందుకే, వారిద్దరి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక శింబు, గౌతమ్ కి ఏఆర్ రెహ్మాన్ కూడా తోడవటంతో ‘నదిగళిలే నీరాడుమ్ సూరియన్’ సినిమాకు ఇంకా మొదలు కాక ముందే క్రేజ్ ఏర్పడిపోయింది…

Read Also : సమంతను దాటిపోయిన పూజా హెగ్డే!

శింబు నెక్ట్స్ మూవీపై ఇంకా అధికారిక ప్రకటనైతే లేదు. కానీ, చెన్నైలో మాత్రం గౌతమ్ మెనన్ డిరెక్టోరియల్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు. ‘వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై కే. గణేశ్ నిర్మించబోయే ‘నదిగళిలే నీరాడుమ్ సూరియన్’ సినిమాకి జయమోహన్ రచయితగా వ్యవహరించనున్నాడు. కమల్ హాసన్, మణిరత్నం లాంటి వారి చిత్రాలు చాలా వాటికి ఆయన గతంలో స్క్రిన్ ప్లే రైటర్ గా తన కలాన్ని అందించాడు. చూడాలి మరి, రెండు సూపర్ హిట్స్ అందించిన శింబు, గౌతమ్, రెహ్మాన్ కాంబో మూడోసారి హ్యాట్రిక్ ని ఖాతాలో వేసుకుంటుందో… లేదో…

Exit mobile version