సమంతను దాటిపోయిన పూజా హెగ్డే!

మొన్నటి వరకూ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన సమంత కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడైతే విజయ్ సేతుపతి తమిళ చిత్రంతో పాటు, పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ మాత్రమే చేస్తోంది. దాంతో సమంత స్థానాన్ని పూజా హెగ్డే రీ ప్లేస్ చేసేసిందని సినీజనం అంటున్నారు. ఇప్పటికే ఈ పొడుగు కాళ్ళ సుందరి చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా యంగ్ హీరోస్ సరసన ఛాన్స్ దొరికితే వదులుకోవాలని మాత్రం పూజా హెగ్డే భావించడం లేదు.

Read Also : చిక్కుల్లో రామ్, లింగుసామి “రాపో19”

కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా చాలా సినిమాల షూటింగ్స్ అప్ అండ్ డౌన్ అయ్యాయి. అవన్నీ ఒక్కసారిగా మొదలు కావడంతో పూజా హెగ్డే ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికే సతమతమవుతోంది. ఈ సమయంలో కూడా కొత్త ప్రాజెక్ట్ గురించి దర్శక నిర్మాతలు సంప్రదిస్తే ‘నో’ చెప్పకుండా… వాళ్ళు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే సమయానికి డేట్స్ అడ్జెస్ట్ చేయగలనేమో అని ఆలోచన చేస్తోందట. అలా తాజాగా నితిన్ తో వక్కంతం వంశీ తీయబోతున్న సినిమాకూ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ‘ఆచార్య’ సెట్స్ పై ఉంది. రెండు హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇవి కాకుండా దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత కోలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ‘బీస్ట్’ తొలి షెడ్యూల్ లో పాల్గొంది. ఇక టాలీవుడ్ లో మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలోనూ; పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ తీయబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్ అనేది బాగా ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఉంటే, త్రివిక్రమ్ తో ఆమెకు ఇది మూడో సినిమా కాగా, హరీశ్ శంకర్ తో రెండో సినిమా. ఇవి కాకుండా హారిక అండ్ హాసిని సంస్థ ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరితో నిర్మించబోయే త్రిభాషా చిత్రంలోనూ పూజా హెగ్డే నే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇలాంటి బహుభాషా చిత్రాలకు అమ్ముడు ఏ మాత్రం మొహమాట పడకుండా రెండున్నర కోట్లు వసూలు చేస్తోందని తెలుస్తోంది. ఏదేమైనా ఇవాళ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ అంటే పూజా హెగ్డేనే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-