NTV Telugu Site icon

Viswak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..

Viswaksen

Viswaksen

Viswak Sen : మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరక్కించాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Read Also :Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్‌ హీరో సందడి.. వీడియో వైరల్!

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ ను ఆశీర్వదించారు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కథ పాతది అయిన కూడా కృష్ణ చైతన్య తన టేకింగ్ తో అదరగొట్టాడు.విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రలో  అద్భుతముగా నటించి మెప్పించాడు.ఈ సినిమాలో అంజలి పాత్ర కూడా ఎంతగానో మెప్పిస్తుంది.అలాగే హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయింది.ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది.మరో రెండు నెలల తరువాత ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Show comments