Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!

Ganesh Acharya Biopic

Ganesh Acharya Biopic

Ganesh Acharya Biopic: సాధారణంగా ఎవరైనా లెజెండరీ వ్యక్తి లేదా సెలబ్రిటీ జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తే.. మరొక దర్శకుడు వారి కథను తెరపైకి తెస్తారు. కానీ ఇండియన్ సినిమాను తన మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాత్రం పూర్తి భిన్నమైన సాహసం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు.. ఆ తర్వాత సాధించిన స్టార్‌డమ్‌ను స్వయంగా తన చేతులతోనే వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఆయన బయోపిక్‌గా రాబోతున్న ‘గణేశ్‌: డస్ట్ టు స్టార్‌డస్ట్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది.

ఈ సినిమాకు సంబంధించి అత్యంత సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే.. తన బయోపిక్‌కు గణేశ్ ఆచార్యనే స్వయంగా కథ రాయడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఆయన కుమార్తె సౌందర్య ఆచార్య నిర్మిస్తుండటం మరో విశేషం. సాధారణంగా సొంత కథను తామే డైరెక్ట్ చేసుకునేటప్పుడు నిజాలను ఎంతవరకు ఉన్నది ఉన్నట్లు చూపిస్తారనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అయితే ట్రైలర్ చూస్తుంటే.. గణేశ్ ఆచార్య ఎక్కడా నాటకీయత కోసం రాజీ పడకుండా, ఒక సాధారణ డ్యాన్సర్ నుంచి బాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ మాస్టర్ స్థాయికి ఎదిగే క్రమంలో పడిన కష్టాలను చాలా రా అండ్ ఎమోషనల్‌గా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో గణేశ్ ఆచార్య పాత్రలో యువ నటుడు శివాంశు సోని నటిస్తున్నారు. అలోక్ షా, సుకన్య కలన్, సాక్షి పవస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జునైద్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మంచి బలాన్ని చేకూర్చాయి. బాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ పాటలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన గణేశ్ ఆచార్య జీవితంలో తెరవెనుక ఇంత పెద్ద పోరాటం ఉందా అనిపించేలా సాగిన ఈ ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్ బయోపిక్ డిసెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. మరి తన సొంత కథతో దర్శకుడిగా గణేశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.