NTV Telugu Site icon

Game Changer : యంగ్ టైగర్ కొట్టేసాడు.. ఇక రామ్ చరణ్ వంతు..

Untitled Design (19)

Untitled Design (19)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ & కొరటాల శివ ల దేవర సెప్టెంబరు 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 6 ఏళ్ళ తర్వతా తారక్ నుండి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర భారీ. ఓపెనింగ్స్ రాబట్టింది. దానికి తోడు టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా హిట్ తో ఎప్పటి నుండో వస్తున్నా సెంటిమెంట్ బ్రేక్ చేసాడు తారక్. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ప్లాప్ తప్పదు అనే నానుడికి ముగింపు పలికి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు తారక్.

Also Read : Jayam Ravi : విడాకులకు కారణం నేను కాదు నన్ను వదిలేయండి : సింగర్ కెనీషా

ఇక టాలీవుడ్ చూపు తర్వాత రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ పై ఉంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ వంతు ముగిసింది. ఇక చరణ్ వంతు. ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది గేమ్ ఛేంజర్. భారతీయుడు-2 వంటి భారీ ప్లాప్ తర్వాత శంకర్ నుండి రానున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. పలు మార్లు రిలీజ్ వాయిదా పడుతూ డిసెంబరు లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అయింది. RRR ఈ ఇద్దరు హీరోల మార్కెట్ ఎంత మాత్రం పెంచింది అనేది ఆయా సినిమాలు కలెక్ట్ చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. దేవర తో తారక్ నిరూపించుకున్నాడు అనే చెప్పాలి. ఓన్లీ ఎన్టీయార్ పేరుతోనే దేవర భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. మరి చరణ్ ఏ మేరకు రాబడతాడో చూడాలి.