NTV Telugu Site icon

Game Changer Third Single : గేమ్ ఛేంజర్ ‘నానా హైరానా’ లిరికల్ సాంగ్ రిలీజ్

Gamechanger

Gamechanger

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘జరగండి’, ‘రా మచ్చా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి.  ఇక ఈ సినిమాలో న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేసిన థర్డ్ సింగిల్  ‘నానా హైరానా ‘ అని సాగే  మెలోడీ గీతాన్ని తాజగా విడుదల చేసారు. ఈ పాటలో శంకర్ రిచ్ నెస్ టేకింగ్ తో పాటు రామ్ జో రాసిన లిరిక్స్ ఎంతో కొత్తగా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది.

Also Read : BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.

Show comments