NTV Telugu Site icon

Game Changer: చరణ్ కోసం డిప్యూటీ సీఎం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అంటే!

Pawan Kalyan

Pawan Kalyan

ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ చేంజర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా సముద్రఖని, ఎస్.జె సూర్య, శ్రీకాంత్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ అమెరికాలో ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

TV Serial Actress: టీవీ సీరియల్ నటి వేధింపుల కేసులో యువకుడు అరెస్ట్

తర్వాత హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ముందు నుంచి ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న ఈవెంట్ జనవరి 4వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఈ రోజున ట్రైలర్ సినిమా మీద అంచనాలపై చేస్తుండగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతామంటూ ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిధులు పేర్కొనడం హాట్ టాపిక్ అవుతోంది.