NTV Telugu Site icon

GameChanger : గేమ్ ఛేంజర్ పైరసీ.. నిందితుల అరెస్ట్..

Game Chenjer

Game Chenjer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్ శంకర్‌ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజు, శిరీష్‌లు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఓ వైపు ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా, దాదాపు 45 మంది వ్యక్తుల సమూహం ద్వారా సినిమా యొక్క పైరేటెడ్ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్  చేసారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసింది.

Also Read : SSMB 29 : రాజమౌళి- మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా..?

అలాగే AP లోకల్ టీవీ అనే టీవీ ఛానెల్ ఆంధ్రప్రదేశ్‌లో పైరేటెడ్ ఫిల్మ్ వెర్షన్‌ను చట్టవిరుద్ధంగా తమ లోకల్ నెట్ వర్క్ లో ఇటీవల ప్రసారం చేసింది. దింతో మేకర్స్ వారిపై కేసు నమోదు చేయగా స్పందించిన పోలీసులు M/S కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్, మేనేజింగ్ డైరెక్టర్ Mr. H.V. చలపతి రాజు, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో గాజువాక పోలీసులు మరియు క్రైమ్ క్లూస్ టీమ్‌తో కలిసి  గేమ్ ఛేంజర్ యొక్క పైరేటెడ్ వెర్షన్‌ను ప్రసారం చేసిన అప్పల రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న AP లోకల్ టీవీపై దాడి చేసి అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేశారు. ఇంతకుముందు, X, Instagram, Facebook మరియు YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గేమ్ ఛేంజర్‌కు వ్యతిరేకంగా  కేవలం లీక్ అయిన క్లిప్‌లు మాత్రమే కాకుండా మొత్తం సినిమాని ఆన్‌లైన్‌లో మరియు టీవీలో షేర్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసారు.