Site icon NTV Telugu

Game Changer : గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Gaem Chenjar

Gaem Chenjar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను మిగిల్చింది.

Also Read : Sandeep Reddy : ఇది మెగా కల్ట్ అంటే.. సందీప్ రెడ్డి ఇన్ స్టా వైరల్..

కానీ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది అమెజాన్. ఫిబ్రవరి 7 న ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. మరోవైపు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబుసన డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాను శరవేగంగా చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే ఓటీటీలో ఈ సినిమాను అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. శంకర్ చెప్పిన 5 గంటల ఫుటేజ్ కాకపోయినా ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న కొన్ని మంచి సీన్లను యాడ్ చేసి రిలీజ్ చేయాలని అంటున్నారు. ఇప్పటికే ఎక్స్‌ట్రా సీన్లతో వచ్చిన పుష్ప2 రీ లోడెడ్ వెర్షన్ ఓటిటిని షేక్ చేస్తోంది. మరి గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Exit mobile version