Karthik Subbaraj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రానికి మూల కథ అందించింది కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అన్న సంగతి తెలిసిందే. అయితే అసలు తను రాసుకున్న ఒరిజినల్ కథ ఏంటి? తెరపైకి వచ్చేసరికి అది ఎలా మారింది? అనే దానిపై కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఫస్ట్ అనుకున్న కథ చాలా రా అండ్ రియలిస్టిక్ పంథాలో సాగేదట. హిందీలో వచ్చిన ‘న్యూటన్’ సినిమా తరహాలో.. ఎన్నికల అధికారి, ఓ ఐఏఎస్ ఆఫీసర్ వ్యవస్థను మార్చేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఆ లైన్ తిరుగుతుందన్నారు.
తమిళ నేటివిటీతో, మదురై బ్యాక్‌డ్రాప్‌లో కాస్త గ్యాంగ్‌స్టర్ డ్రామాను జోడించి గేమ్ ఛేంజర్ స్టోరీని ఆయన చాలా సహజంగా రాసుకున్నారట. ఆ సమయంలో ఆయన ‘మహాన్’ సినిమా తీసే పనిలో ఉండటంతో పూర్తి స్క్రీన్‌ప్లే రాయలేక, కేవలం మూల కథను మాత్రమే శంకర్‌కు అందించానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే రామ్ చరణ్ లాంటి స్టార్ ఇమేజ్, వందల కోట్ల భారీ బడ్జెట్ తోడయ్యేసరికి.. కథ తాలూకు స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ఆయన అభిప్రాయడ్డారు. తాను అనుకున్న రియలిస్టిక్ డ్రామా కాస్తా, శంకర్ మార్క్ భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారిందని చెప్పారు. కథలో మార్పులు చేర్పులు జరిగినప్పటికీ, శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ తన కథను ఎంచుకుని సినిమాగా తీయడం తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.

