Gadadhari Hanuman: అంచనాలు పెంచేలా ‘గదాధారి హనుమాన్’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రోహిత్ కొల్లి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశాను.
Also Read:Prabhas: ప్రభాస్ దేవుడి బిడ్డ.. యూట్యూబర్ కామెంట్స్ వైరల్!
Also Read
బసవ సర్‌తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నాం. కానీ మా రవి గారు జాయిన్ అవ్వడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారు. రేణుకా ప్రసాద్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..