NTV Telugu Site icon

Gabbar Singh4K : ‘మురారి’ని మడత పెట్టిన ‘గబ్బర్ సింగ్’.. డే -1ఎన్ని కోట్లంటే..?

Untitled Design (12)

Untitled Design (12)

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ భారీ స్థాయిలో జరుగుతుంది. డైరెక్ట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ రాబడుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ రీ-రిలీజ్‌ చేశారు మేకర్స్.

Also Read: Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..

ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో, మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. కేవలం అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ 4 కోట్ల రూపాయల కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి మొత్తం రూ. 8.02 కోట్లు రాబట్టి పవర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీరిలీజ్ డే – 1 (రూ .5.41Cr)ను  బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్ రన్ లో గబ్బర్ సింగ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గబ్బర్ సింగ్ రిలిజ్ అయి దాదాపు 12 ఏళ్ళు కావొచ్చినా కూడా ఇప్పటికీ [పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని రీరిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ చుస్తే అర్ధమవుతోంది.