Site icon NTV Telugu

Funky Release Date: ‘ఫంకీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Funky Movie Release Date

Funky Movie Release Date

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’. ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు పండగ కబురు వచ్చింది. ఇంకో 30 రోజుల్లోపే.. ఈ వాలెంటైన్స్ వీకెండ్‌ను సరదా, భావోద్వేగాలు, పూర్తి స్థాయి వినోదంతో నింపేందుకు ‘ఫంకీ’ సిద్ధమైంది. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫంకీ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘టీమ్ ఫంకీ’ అభిమానులతో సినిమా అప్ డేట్స్ పంచుకుంది.

Also Read: Suriya-Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘కరుప్పు’ విడుదలపై క్లారిటీ!

ఫంకీ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మేళవిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వక్ సేన్ నటన, పాత్రలు, వినూత్న కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, వంశీ నిర్మిసున్నారు. కయాదు లోహార్‌ హీరోయిన్‌ కాగా.. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. 2026 వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకులకు ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ‘ఫంకీ’ రెడీ అవుతోంది.

Exit mobile version