NTV Telugu Site icon

PrabhasHanu : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కీలక అప్‌డేట్

Fouji

Fouji

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేసాడు దర్శకుడు హను రాఘవపూడి.

Also Read : Bollywood : హిందీలో డే-1 కంటే డే- 4 ఎక్కువ రాబట్టిన పుష్ప -2

ఇటీవల ఫౌజీ సెకండ్ షెడ్యుల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు. రాజా సాబ్ షూట్ లేని రోజు ఫౌజీ షూట్ లో పాల్గొనేలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ రెండు సినిమాలను చక చక రెడీ చేస్తున్నాడు. ఫౌజీ కి సంబందించిన కీలక అప్డేట్ వెలువడింది. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన భారీ సెట్స్ లో ఈ సినిమాలోని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ చేస్తున్నారు. సినిమాలో వచ్చే జైలు నేప‌థ్యంలో సాగే కొన్ని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ ఇప్పటికే మూడు పాట‌లను సిద్ధం చేసాడట. విశాల్ మ్యూజిక్ పట్ల హను రాఘవపూడి సంతృప్తిగా ఉన్నాడట. బ్రిటిష్ కాలం నాటి రాజకార్ల పాలనలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి.

Show comments