‘పుష్ప 2’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించింది చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ సినిమా కు సీక్వెల్‌గా ‘పుష్ప2’ తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది.ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు.
Also Read:Anshu Ambani: షూటింగ్ మొదటి రోజు చాలా నెర్వస్ ఫీలయ్యాను : అన్షు
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యాడు.. ‘నాతో పాటు ఈ సినిమా కోసం 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్ గ్రాఫ్ చూస్తే సుకుమార్ లేకుండా ఏముందా అని ఊహించుకోలేను. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలను సుకుమార్ తెరకెక్కించినందుకే ఈ రేంజ్ సక్సెస్ అయ్యింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్‌కు నేను కారణం కాదు. కేవలం సుకుమార్ మాత్రమే. ఈ అయిదు సంవత్సరాలు సుకుమార్‌ని పిచ్చోడిలా ఫాలో అయ్యాను. ఇక మూడో భాగం గురించి ఇప్పుడేం చెప్పలేను. దేవుడి దయ ఉంటే అల్లు ఆర్మీని మరింత గర్వపడేలా చేస్తా. ఈ మూవీ పాటల గురించి మాట్లాడుకుంటే మిలియన్లు చేస్తే చాలనుకుంటే ఏకంగా బిలియన్ల రుచి చూపించిన దేవిశ్రీ ప్రసాద్‌కు నా కృతజ్ఞతలు. పుష్ప 2 స్మూత్ రిలీజ్ కోసం సహకరించి అన్ని బాషల పరిశ్రమలకు ధన్యవాదాలు, సరైన గైడెన్స్ లేకపోతే ఒక మంచి నటుడు బ్యాడ్ యాక్టర్‌గా మారే ప్రమాదముంది. కానీ సుకుమార్ వల్ల నేను ఈ స్థాయిలో కూర్చున్నాను. మీరు నాకు పర్సన్ కాదు ఎమోషనల్’ అంటూ చెప్పుకొచ్చాడు.