NTV Telugu Site icon

Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?

Untitled Design (13)

Untitled Design (13)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపధ్యంలో వరద భాదితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు   విరాళాలు అందిస్తున్నారు.

1 – జూనియర్ ఎన్టీయార్ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం అందించారు

2 – హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ AP సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, TG సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు

3 – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు

4 – టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు

5 – మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు విరాళాలు ఇచ్చారు

6 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 30 లక్షల విరాళం

7 – దర్శకుడు త్రివిక్రమ్, హారిక హాసిని నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు

8 – రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ఇచ్చారు.

9 – ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత కల్కి చిత్ర నిర్మాత అశ్వినీదత్ రూ.25 లక్షలు ప్రకటించారు

10 – యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ రూ. 2.5 లక్షల చొప్పున రూ. 5 లక్షలు సీఎం సహాయనిధికి ఇచ్చారు

Also Read: Gabbar Singh4K : ‘మురారి’ని మడత పెట్టిన ‘గబ్బర్ సింగ్’.. డే -1ఎన్ని కోట్లంటే..?