Site icon NTV Telugu

మహేష్ బాబుకు ఫస్ట్ బెస్ట్ విషెస్

First Best Wish To Mahesh Babu On His Birth Day

సూపర్‌స్టార్ సోమవారం 46 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక రోజున సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ పోస్ట్ చేసి ఇలా వ్రాశారు. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా ఇప్పుడు, ఎప్పటికీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను” అంటూ విష్ చేశారు.

Read Also : హ్యాపీ యానివర్సరీ మై లవ్… రానాకు మిహిక విషెస్

ఈ పిక్ లో నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు ఆమెను కౌగిలించుకోవడం, హృదయపూర్వకంగా నవ్వుతూ కన్పించాడు. ఇక మహేష్ బాబు 2005లో నమ్రత శిరోద్కర్‌ను “వంశీ” సినిమా సెట్‌లో కలుసుకున్నాడు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి, తరువాత వివాహం చేసుకున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల వివాహం 2005లో జరిగింది. ఈ జంటకు 2006లో గౌతమ్‌, 2012లో సితార జన్మించారు. ఈ అందమైన ఫ్యామిలీ పిక్స్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Exit mobile version