బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా జాట్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ‘జాట్’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని అలాగే మైత్రీ మూవి మేకర్స్ తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టారు.
Also Read : ED Notice To Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ‘ఈడీ’ నోటీసులు
ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జాట్ ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది. సన్నీ డియోల్ నటన మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ రెగ్యులర్ రొటీన్ తెలుగు సినిమా టెంప్లేట్ కథలో బాలీవుడ్ హీరోను తీసుకున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా జాట్ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన మొదటి రోజు రూ. 11.6 కోట్లతో మంచి స్టార్ట్ అందుకున్నజాట్ మొదటి వారం నాటికి రూ. 49.3 కోట్లు రాబట్టింది. ఇక రెగ్యులర్ డేస్ లోను డీసెంట్ కలెక్షన్స్ రాబడుతు దూసుకెళ్లిన జాట్ లేటెస్ట్ గా మరో మైలురాయిని అందుకుంది. రిలీజ్ అయిన 11 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 102.13 కోట్లు కలెక్ట్ చేసింది. అందుకు సంబంధించి అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. జాట్ ఇచ్చిన జోష్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా జాట్ 2 ను కూడా ఇటీవల ప్రకటించారు మేకర్స్.
