Site icon NTV Telugu

Film Journalists: ఫిలిం జర్నలిస్టు సంఘాలతో ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం

Film Chamber

Film Chamber

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సంఘాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తాజాగా సమావేశం అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, అలాగే కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫేక్ థంబ్‌నెయిల్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం వంటి అంశాలపై చర్చించారు. ఇకమీదట ఛాంబర్ తరపున ఈ ఫేక్ న్యూస్, ఫేక్ థంబ్ నెయిల్స్ విషయంలో పోరాడే విషయంలో సపోర్ట్ లభిస్తుందని హామీ ఇచ్చారు.

Rakul Preet Singh : ఆ బట్టలు ధరించాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాలి..

అంతేకాక, సీరియస్ ఇష్యూస్ మీద క్రిమినల్ కేసులు బనాయించే విషయంలో కూడా ఛాంబర్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఛాంబర్ పైరసీ విషయంలో సైబర్ టీంతో టచ్‌లో ఉందని, ఈ సెలబ్రిటీల అంశాలపై ఫేక్ న్యూస్, ఫేక్ థంబ్‌నెయిల్స్ పెడుతున్న వ్యవహారం మీద కూడా తాము వారితో మాట్లాడతామని ఈ సందర్భంగా ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అలాగే, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నిర్వహిస్తున్న పలు ప్రెస్ మీట్స్ విషయంలో కూడా కొన్ని సూచనలు జర్నలిస్టు సంఘాల నుంచి, చాంబర్ నుంచి రాగా, వాటిపై చర్చలు జరిపారు.

Exit mobile version