Site icon NTV Telugu

Tollywood : కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ నివాళి!

Tfcc

Tfcc

ఇటీవల కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది.

Also Read : STR : సెట్స్ పై అరడజను సినిమాలు.. డిస్కషన్స్ లో మరో రెండు

ఈ క్రమంలో MAA మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామం అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ దాడికి ప్రపంచం మొత్తం కూడా బాధకు గురయ్యింది అన్నారు. మన దేశంలో మంచి మంచి పర్యాటక ప్రదేశాలు వున్నా, పక్క దేశాల వారు రావడానికి ఇష్టం చూపించట్లేదు అన్నారు. దానికి కారణం మనలో మనకే తేడాలు అన్నారు. ఆ తేడాలు పక్కన పెట్టి అందరం ఒకటిగా ఉందాం అన్నారు. భారతీయులంతా ఒక్కటిగా ఐక్యమత్యంగా ఉందాం అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను కట్టడి చెయ్యడానికి సిద్ధమైన అధికారులకు అండగా ఉందాం అని తెలిపారు.

Also Read : Athadu4k : రీరిలీజ్ లో రికార్డ్ ధర పలికిన మహేశ్ ‘అతడు’

అలాగే MAA అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాదల రవి   మాట్లాడుతూ ‘ఉగ్రదాడిపై విరుచుకుపడ్డారు. చనిపోయిన 26 మంది కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు సిద్ధమైన అధికారులకు మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాలు సహకరించాలని కోరారు. ఇందుకు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని అన్నారు.

Exit mobile version