Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో తుదిశ్యాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. అయితే, కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా ఆయన తన సత్తా చాటారు.
Read Also: Astrology: జులై 13, ఆదివారం దినఫలాలు
అయితే, కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నాడు.. కానీ, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో నాటకాల వైపు అడుగులు వేశాడు. సినిమాల్లోకి రాక ముందే ఆయన స్టేట్ బ్యాంకులో విధులు నిర్వహించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ మూవీతో
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో యాక్టింగ్ చేశారు.
Read Also: K.K Senthil Kumar: ‘జూనియర్’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!
ఇక, కోట శ్రీనివాసరావు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో యాక్టింగ్ చేశారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ కోట తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరి.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
