Site icon NTV Telugu

Miss India: ఏపీ నుంచి మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన భవ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Femina Miss Andhrapradesh

Femina Miss Andhrapradesh

Femina Miss India Andhra Pradesh 2024: ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫెమీనా మిస్‌ ఇండియా’ కిరీటాన్ని దక్కినంచుకునేందుకు ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా అనేక మంది భామలు పోటీ పడుతున్నారు. అయితే మన ఏపీ నుంచి తెలుగమ్మాయి భవ్య రెడ్డి ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ గా ఎంపికైంది. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ ఆకృతి స్కూల్ లో చదువుకున్న ఆమె మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ పట్టా పుచ్చుకుంది.

Viraji: ఆహా అనిపిస్తున్న “విరాజి”

భవ్య రెడ్డి ఒక ఫ్యాషన్ మోడల్, అలాగే కార్పొరేట్ ప్రొఫెషనల్. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె అనేక టీవీ ఛానెల్‌లలో తన ప్రదర్శనలతో ఫాన్స్ ను సంపాదించింది. అలాగే ప్రపంచ తెలుగు IT కౌన్సిల్ (WTIC) ఈవెంట్‌లో మంత్రముగ్ధులను చేసే సోలో డ్యాన్స్‌తో ఆరంగ్రేటం చేసింది. అమెజాన్ సహా కరారీ జ్యువెలర్స్ వెబ్‌సైట్‌లో ఆమెను మోడల్ గా తీసుకున్నారు. భవ్య తన తండ్రి గౌరవార్థం స్థాపించబడిన లాభాపేక్షలేని మానసిక ఆరోగ్య కార్యక్రమం మైండ్ కైండ్ ను నిర్వహిస్తోంది. భవ్య నాయకత్వంలో మైండ్ కైండ్ 1,500 మంది యువకులకు చేరువై అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో మెంటల్ హెల్త్ క్లబ్‌లను ఏర్పాటు చేసింది.

Exit mobile version