Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్‌!

Fauji Vs Spirit Updates Clash

Fauji Vs Spirit Updates Clash

Prabhas Birthday Updates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో.. డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తున్న ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఫౌజీ డిసెంబర్ 3న, స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్పిరిట్‌పై ఉన్న భారీ అంచనాలకు ఈ అప్‌డేట్ మరింత హైప్ తీసుకురావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు ఫౌజీ టీమ్ కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తమ సినిమా నుంచి వీడియో కంటెంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే రోజు ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి అప్‌డేట్స్ వస్తే సోషల్ మీడియాలో సహజంగానే పోలికలు మొదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రిలీజ్ విషయంలో ఫౌజీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ముందుగా విడుదల కానున్న సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ భావించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఫౌజీ కోసం స్పిరిట్ బర్త్‌డే అప్‌డేట్‌ను వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ప్రభాస్ సినిమాల మధ్యే రిలీజ్‌కు ముందే మొదలైన ఈ చిన్నపాటి ‘క్లాష్’ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.