Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Birthday Updates: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే థియేటర్లలోకి రానుండటంతో.. డార్లింగ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తున్న ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఫౌజీ డిసెంబర్ 3న, స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బర్త్‌డే సందర్భంగా అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్పిరిట్‌పై ఉన్న భారీ అంచనాలకు ఈ అప్డేట్ మరింత హైప్ తీసుకురావడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
మరోవైపు ఫౌజీ టీమ్ కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తమ సినిమా నుంచి వీడియో కంటెంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే రోజు ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్ వస్తే సోషల్ మీడియాలో సహజంగానే పోలికలు మొదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రిలీజ్ విషయంలో ఫౌజీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ముందుగా విడుదల కానున్న సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ భావించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఫౌజీ కోసం స్పిరిట్ బర్త్‌డే అప్డేట్ను వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ప్రభాస్ సినిమాల మధ్యే రిలీజ్‌కు ముందే మొదలైన ఈ చిన్నపాటి ‘క్లాష్’ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?