Site icon NTV Telugu

యూరోప్, అమెరికా తరువాత ఇండియాలోకి ‘ఎఫ్ 9’! ఆగస్ట్ 5న ‘రేసింగ్ బిగిన్స్’!

Fast and Furious 9 to release in India on August 5th

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఇండియాకి స్లోగా వచ్చేస్తోంది! ఎప్పుడో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ అనేక వాయిదాల తరువాత యూరోప్, అమెరికా, చైనా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్స్ లో ఎట్టకేలకు విడుదలైంది. అంతటా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, ఆగస్ట్ 5న విన్ డీజిల్ స్టారర్ కార్ రేసింగ్ యాక్షన్ డ్రామా మన ముందుకు రాబోతోంది. ‘ఎఫ్ 9’ మూవీ అఫీషియల్ ఇండియన్ రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు…

Read Also : గ్లోయింగ్ లుక్ తో మెరిసిపోతున్న సామ్… పిక్ వైరల్

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజ్ హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సిరీస్ ల సరసన నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వసూలు చేసింది. తాజా ‘ఎఫ్ 9’ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో 9వ సీక్వెల్. గత చిత్రాల మాదిరిగానే ఈసారి కూడా రష్యా, కెనడా లాంటి మార్కెట్స్ తో సహా ప్రపంచం నలుమూలలా కోట్లు కొల్లగొడుతోంది. ఇండియాలోనూ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లవ్వర్స్ చాలా మందే ఉన్నారు. అంతేగాక, ఈ సంవత్సరం మన దేశంలో విడుదలవుతోన్న తొలి హాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ కూడా ఇదే! ‘ఎఫ్ 9’ పర్ఫామెన్స్ పైనే ఇండియాలో ముందు ముందు హాలీవుడ్ చిత్రాల విడుదల ఆధారపడి ఉంది…

Exit mobile version