పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అప్పుడే మొదలెట్టేశారు. ఆయన 50వ పుట్టినరోజును సెప్టెంబర్ 2న జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు 50 రోజుల ముందుగానే బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో నేటి నుంచే #AdvanceHBDJanaSenani అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ హీరోకు సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజుకు దాదాపు నెలరోజులపైనే ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నారు.
Read Also : రేపే ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’… ఓ రేంజ్‌లో హైప్!
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ స్టార్ హీరో నటుడు మాత్రమే కాదు, జనసేన పార్టీ అధినేత అన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఇక ఈ వేడుకలను ‘పవనోత్సవం’ అని పిలుస్తూ పవన్ వేడుకలను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే వారు వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ కోసం మునుపెన్నడూ లేని రికార్డును నెలకొల్పడానికి ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’ రీమేక్ లో నటిస్తున్నారు. తరువాత క్రిష్ తో మధ్యలో ఆపేసిన “హరి హర వీరమల్లు” ప్రారంభించనున్నారు.
