NTV Telugu Site icon

Prakash Raj: ఆసక్తి రేపుతున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. డియర్ సుప్రీం లీడర్ అంటూ..

Hero Prakahs Raj

Hero Prakahs Raj

సినీ నటుడు రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై సెటైర్లు వేశారు. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన విమర్శించారు. ప్రధాని పేరు ప్రస్తావించకుండా డియర్ సుప్రీం లీడర్, హైదరాబాద్ కు స్వాగతం అంటూ ట్వీట్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందని ప్రకాశ్ రాజ్ కితాబిచ్చారు.

అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ పర్యటనల సందర్భంగా రోడ్లు వేయడానికి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును ఖర్చు చేస్తున్నారని.. అదే ఇక్కడ ప్రజల అభివృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలోనే పర్యటనను ఆస్వాదించాలని.. దూరదృష్టితో అభివృద్ధి ఎలా చేయాలో తెలంగాణలో చూసి నేర్చుకోవాలని హితవు పలికారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం, యాదగిరిగుట్ట, టీ-హబ్, ఆసుపత్రి, గురుకుల విద్యాలయం, సీఎం కేసీఆర్ ఫోటోను ప్రకాశ్ రాజ్ షేర్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.