NTV Telugu Site icon

Vishwak Sen : సూపర్ రెస్పాన్స్ రాబట్టిన మెకానిక్ రాకి సెకండ్ లిరికల్ సాంగ్..

Untitled Design (11)

Untitled Design (11)

వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు. ఫస్ట్ లుక్ నుండి ఫస్ట్ గేర్ వరకు ఫస్ట్ సింగిల్ వరకు రిలీజ్ చేసిన మెటీరియల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా  రెండవ సింగిల్ ‘ఓ పిల్ల’ను విడుదల చేశారు మేకర్స్.

Also Read : Devara : అమెరికాలో ‘దేవర’ స్పెషల్ ప్రీమియర్ షోకు Jr. NTR

మొదటి సింగిల్‌కి భిన్నంగా, ఊ పిల్లా అనేది పెప్పీ బీట్‌లో ఇన్స్టంట్ గా ఆకట్టుకునే విధంగా ఈ సెకండ్ లిరికల్ సాంగ్ సాగింది. ఇటీవలే సరిపోదా శనివారం కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రాకీ మరియు ప్రియల ప్రేమకథను పరిచయం చేసేలా  ‘బి-టెక్ లో నే మిస్సయనే నిన్నే కొంచంలో’ అంటూ కృష్ణ చైతన్య రాసిన సాహిత్యం కథానాయకుడు తన ప్రేమపై ఉన్న భావాలను వివరిస్తుంది. నకాష్ అజీజ్ ఈ పాటను మనోహరంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్ మరియు మీనాక్షి కలిసి అందంగా కనిపించారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.  సత్యం రాజేష్ మరియు విద్యా సాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలగా వ్యవహరిస్తున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానుంది.

Show comments