Site icon NTV Telugu

Faima : జబర్దస్త్ షో ఫుడ్ గురించి ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Whatsapp Image 2024 05 07 At 9.20.35 Am

Whatsapp Image 2024 05 07 At 9.20.35 Am

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షో ద్వారా ఎంతోమంది నటినటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుధీర్ ,గెటప్ శీను, రాంప్రసాద్,హైపర్ ఆది ,షకలక శంకర్ వంటి వారు సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు .ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ షో లో ఎప్పటికప్పుడు టాలెంటెడ్ కమెడియన్స్ తమ ప్రతిభను నిరూపించుకుంటారు .అందుకే ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ షో కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం ఈ షో కు ప్రేక్షకులలో ఆదరణ బాగా వుంది.

అయితే జబర్దస్త్ లో పెట్టె ఫుడ్ గురించి గతంలో ఓ ఇష్యూ వైరల్ అయింది .ఈ షో లో ఫుడ్ అస్సలు బాగోదు అంటూ అప్పట్లో కిర్రాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేసారు .మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ షో లో ఫుడ్ అస్సలు బాగోదు..తప్పనిసరి పరిస్థితులలో మేము తినాల్సి వచ్చేది అని గతంలో ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆర్పి చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదని గతంలో హైపర్ ఆది ,రాంప్రసాద్ వివరణ ఇచ్చారు .తాజాగా యాక్టర్ ఫైమా జబర్దస్త్ షో లో ఫుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .ఆమె మాట్లాడుతూ నేను ఇప్పటికి ఆ ఫుడ్ తింటున్నాను .ఫుడ్ గురించి వస్తున్నవార్తలు అవాస్తవం.సంస్థ మీద కోపం వున్న వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు అని ఫైమా తెలిపింది .

Exit mobile version