Site icon NTV Telugu

భార్యలతో పాటు స్టార్స్ అంతా ఒకేచోట… పిక్ వైరల్

Fahadh, Dulquer and Prithviraj with their wives in new pic

భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్‌, ఫహద్ ఫాసిల్ తన భార్య నజ్రియాతో కలిసి కన్పిస్తున్నారు. వీరంతా ఈ అద్భుతమైన క్షణాన్ని మిర్రర్ సెల్ఫీలో బంధించారు. ఇక ఈ గెట్ టు గెదర్ లో అందరూ బ్లాక్ కలర్ డ్రెస్ లు ధరించడం గమనార్హం. ఎవరూ ఊహించని విధంగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులైన నటులంతా ఒకేచోట కన్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also : 231 కిమీ నడిచి వచ్చిన ఫ్యాన్స్… అది తెలిసి చరణ్ ఇలా…!!

నజ్రియా నాజీమ్ చివరిసారిగా ‘ట్రాన్స్‌’లో కనిపించింది. దీనిలో ఆమె తన భర్త ఫహద్ ఫాసిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నాని చిత్రంతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ‘కోల్డ్ కేస్’ విడుదల కోసం పృథ్వీరాజ్ సన్నద్ధమవుతుండగా, దుల్కర్ సల్మాన్ తన ‘కురూప్’, ‘సెల్యూట్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.

Exit mobile version