Site icon NTV Telugu

Single: ఈ సింగిల్ గాడి దెబ్బకు షోస్ డబుల్

Single Movie

Single Movie

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ అనే సినిమా, ‘సింగిల్’తో పోలిస్తే బాగా వెనకబడిపోయింది. ‘సింగిల్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా షోలు మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా ముందుగా అనుకున్న షోల కంటే రెట్టింపు షోలు నడుస్తున్నాయని సమాచారం.

Also Read: Akanda 2 : వెయ్యి మందితో బాలయ్య యాక్షన్ సీన్..?

భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కెమిస్ట్రీ బాగా కుదిరినందున, వీరిద్దరి కామెడీ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 11 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని కోట్లు సాధించడం మామూలు విషయం కాదు. నిజానికి, ఈ సినిమా కేవలం 6 కోట్ల మార్కెట్‌తో బరిలోకి దిగింది. రెండు రోజుల్లోనే సినిమా కొనుగోలు చేసిన వారందరూ సేఫ్ జోన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version